ఈ క్రింద వాటిలో ఏ ఒక్కటైనా మీ సంఘoలో భోదిస్తే/ఆచరిస్తే మీరు వేరొక సంఘానికి వెళ్ళటం మంచిది.

ఈ క్రింద వాటిలో ఏ ఒక్కటైనా మీ సంఘoలో భోదిస్తే/ఆచరిస్తే మీరు వేరొక సంఘానికి వెళ్ళటం మంచిది.
⛔️ 1 . త్రిత్వ సిద్దాంతాన్ని నమ్మకుండా ప్రసంగాలు చేయడం
⛔️ 2. యేసు దేవుడు కాదు కేవలం దేవుని కుమారుడని దుర్భోధ చేయడం
⛔️ 3. భూమిమీద యేసు దైవత్వాన్ని కోల్పోయారని దుర్భోధ చేయడం
⛔️ 4. దేవునికి మనుషులకు మధ్య వేరొక వ్యక్తులు ఉన్నారని దుర్భోధ చేయడం.చనిపోయిన వారు మన గురించి దేవునితో విగ్యాపణ చేస్తారని బోధించడం.  
⛔️ 5. రక్షణ మనం చెస్తున్న మంచి క్రియల మీద కూడా ఆధారపడి ఉంటుందని దుర్భోధ చేయడం.  
⛔️ 6. పాతనిభంధనలో ఉన్న ఆచారాలు క్రైస్తవులకు వర్తిస్తుందని బోధించడం. యేసు క్రీస్తు ప్రస్తావన లేకుండా వారి ప్రసంగాలను ముగించడం.
⛔️ 7. సాక్ష్యాలను చూపించి మిమల్ని టీవీ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయమని అడగటం
⛔️ 8. దశం భాగం గురించి ఎక్కువ సార్లు బోధించటం. మీ దగ్గర డబ్బులేకపోయినా దాసంభాగం క్రమం తప్పకుండా ఇవ్వాలని బలవంతం చేయడం. మీరు విత్తండి దేవుడు మీకు ఆశీర్వదిస్తాడని వాక్యాన్ని వక్రీకరించి దశమభాగాలు కానుకలను తీసుకోవటం. 
⛔️ 9. పాస్టర్ని కలిసి ప్రార్ధన చేపించుకోవడానికి రిజిస్ట్రేషన్ ద్వారా మీ డబ్బులు తీసుకోవడం.
⛔️ 10. క్రైస్తవులు సుఖసంతోషాలతో ఉంటారని ఇహలోక ఆశీర్వాదాల గురించి మాత్రమే బోధించటం.
⛔️ 11. సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్స్ గురించి విపరీతంగా మాట్లాడటం, మీరు కూడా చిన్న దేవుళ్ళని (little gods) దుర్భోధ చేయడం
⛔️ 12. “ఇది దేవుడు నాకు బయలుపరిచాడు" అని అనడం . 
⛔️ 13. ప్రవచనాలను కేవలం జరగబోయే వాటికి పరిమితం చేయడం & పేర్లు పెట్టి పిలవటం, జేబులో డబ్బులు ఎంత ఉందని ప్రవచనం అంటూ సంఘంలో చిలక జ్యోతిష్యం చెప్పడం
⛔️ 14. వ్యక్తిగత సాక్ష్యాలను వాక్యంతో జోడించి బోధించడం
⛔️ 15. వాక్యం కన్నా స్వస్థతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం. 
⛔️ 16. అనారోగ్యం వస్తే విశ్వాసం లేదని అనడం. మందులు హాస్పిటల్ కు వెళ్ళవద్దు ప్రార్ధన మాత్రం చేయండని బోధించడం.
⛔️ 17. బోధకుడు ఆత్మ ఫలాలను కనపరచకుండా ఆత్మ వరాలను ఉన్నాయని కనపరచడం.
⛔️ 18. సంఘంలో అర్ధంలేని మాటలను అరుస్తూ భాషలంటూ పద్ధతి లేకుండా వ్యవరించడం క్రిందపడి దొర్లటం , నవ్వుతూ ఊగిపోతూ అవి పరిశుద్దాత్మ వరాలని అనటం . భాషల వరం లేదంటే చిన్నచూపు చూడటం. భాషలు నేర్పించడానికి తరగతులు, భాషలలో మాట్లాడని ఇతరులను బలవంతం చేయడం.
⛔️ 19. విశ్వాసం ద్వారా దేవుని కదిలింపవచ్చు అని దుర్భోధ చేయటం. కష్టాలు బాధలు క్రైస్తవులకు రావని బోధించడం. విశ్వాసం ద్వార మనకు కావాల్సినవి దేవుని నుండి పొందుకోవచ్చని బోధించడం.
⛔️ 20. పాస్టర్లకు ఆ సంఘ సభ్యులు పెద్దపీఠం వేయటం . ప్రవక్తని, అపోస్తులని చెప్పుకోవటం.
⛔️ 21. కులాన్ని ఆచరించడం, క్రైస్తవ వివాహ సంబంధాలకు కులాన్ని చూడటం.
⛔️ 22. మీ పాస్టర్ ఇతరులు చెస్తున్న దుర్భోధలు తెలిసినా వాటిని ఖండించకుండా ఉండటం.
⛔️ 23. మారుమనస్సు , పశ్చాతాపం లేనివారికి "బాప్తీస్మం" ఇవ్వడం. వివాహం , జాబ్ కోసం "బాప్తీస్మం" ఇవ్వడం.
⛔️ 24. కృపా కాలంలో ఉన్నామని, మీరు ఏ పాపం చేసినా దేవుని క్షమాపణ, మారుమనస్సు హృదయం అవసరంలేదని దృభోధ చేయటం
⛔️ 25. బైబిలుతో పాటు ఇతర మత గ్రంధాలు కూడా దైవప్రేరణ ద్వారా రాయబడిందని దుర్భోధ చేయటం
⛔️ 26. వేదాలలో యేసు ఉన్నారని దుర్భోధ చేయటం, అన్య ఆచారాలను క్రైస్తవ్యంలో కలుపుకోవడం. దేవుని లక్షణాలు తమలో ఉన్నాయని దైవ దూషణ చేయడం. 
⛔️ 27. పాపాన్ని ఖండించి ప్రసంగం చేయడం పరిపక్వత లేనివారే చేస్తారని భయంకరమైన దుర్భోధ చేయడం. వాక్యంలో లేని అర్ధాలను వెతకటం. 
⛔️ 28. బెన్నీ హిన్, జోయెల్ ఓస్టిన్, జాయిస్ మేయర్ , కెన్నిత్ కోప్లాన్డ్ వంటి దుర్భోధకులను మీ పాస్టర్ ఫాలో అవ్వడం. వారి టీవీ ప్రోగ్రాం చూడమని మిమల్ని ప్రోత్సహించడం.
⛔️ 29. బైబిల్ నియమింపబడిన సంఘ పద్ధతిని అనుసరించకపోవటం. సంఘ పెద్దలు , జవాబు దారి లేకపోవటం. అతనే అందరికి కనపడాలని తాపత్రేయపడటం.
⛔️ 30. పాస్టర్ మర్యాదలు, సన్మానాలకు ఎక్కువగా ఆసక్తి చూపడం. సంఘ సభ్యుల నుంచి కానుకలు తీసుకొని వాటిలో కొంతైనా సంఘంలో పేదలకు విధవరాళ్ళకు సహాయం చెయ్యకపోవడం. అనారోగ్యంతో ఉన్నవారికోసం సాధ్యపడినంతవరకు ధన సహాయం చేయకపోవడం. 
⛔️ 31. సంఘంలో పదవి కోసం ప్రాకులాడటం.
⛔️ 32. సంఘ సభ్యులు పాపం చేస్తున్నారని తెలిసికూడా పాస్టర్ వారిని మందలించకుండ ఉండటం.
⛔️ 33. పాస్టర్ కేవలం డబ్బు పలుకుబడి ఉన్న సంఘ సభ్యుల ఇంటికి వెళ్ళి ప్రార్ధన చేయడం
⛔️ 34. డిజిటల్ స్క్రీన్ సంఘాలను స్థాపించడం. పాస్టర్ ఆడంబరంగా ఉంటూ మిమల్ని ఎప్పుడూ డబ్బులు ఇవ్వమని బలవంతం చేయటం. 
⛔️ 35. సంఘ సభ్యులు సహాయం చేస్తున్నారని చెప్తూ కావాలని వారిని తమ ఇంటి చాకిరీ చేయడానికి వాడుకోవడం.
⛔️ 36. సేవలోనికి రావాలనుకుంటే వివాహం చేసుకోకుండా ఉండాలని బోధించడం.  
⛔️ 37. ప్రసంగాలలో వారి కుటుంబాన్ని హేచిస్తు సంఘాన్ని స్తాపించినవారిని పొగుడుతూ మాట్లాడడం. సంఘంలో వారి కుటుంబానికి ఉన్న తలాంతులు చూపించుకుంటూ ఇతరులకు అవకాశం ఇవ్వకుండా చేయడం.
⛔️38. లగ్జరీ కార్ల మీద ఖరీదైన సూట్లమీద మోజుని కలిగి ఉంటడం. సెలబ్రిటీ స్టేటస్ కావాలనుకోవడం. సంఘస్థులు ఇచ్చిన కానుకలను టూర్లకు, షికారులకు దుర్వినియోగం చేయటం.  
⛔️ 39. యేసు ప్రభువుకు శిష్యులుగా సంఘస్థులను నడిపించకుండా పాస్టర్లకు శిష్యులుగా చేసుకోవడం.
⛔️ 40. పాస్టర్ ఒకవేళ దుర్భోధ చేస్తే వాటిని మీరు ప్రశ్నిస్తే, అతడు సరిచేసుకోకుండా మిమల్ని ఎదురించడం, అభిషేకించబడిన సేవకుడిని ప్రశ్నించకూడదని అనడం. 
-------------------------
యూదా 1:3 - పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.

Comments

Popular posts from this blog

THE FRIENDS OR COMPANY YOU KEEP CAN DETERMINE THE OUTCOME OF YOUR LIFE.

THE DIFFERENT STAGES OF MARRIAGE.

Don't Marry